కడప, ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జిల నియామకం

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాదాపు మరో 7 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2023-09-08 06:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాదాపు మరో 7 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అవుతుంది. నియోజకవర్గాల ఇన్‌చార్జిలను ప్రకటిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా కీలకమైన రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‍ఛార్జిగా మాధవీరెడ్డిని టీడీపీ అధిష్టానం నియమించింది. మరోవైపు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‍ఛార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులును నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ప్రత్తిపాడు(ఎస్సి) నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా టీడీపీ హెచ్.ఆర్.డి విభాగం చైర్మన్, బూర్ల రామాంజనేయులు, కడప నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా రెడ్డెప్ప గారి మాధవి రెడ్డిని నియమించడమైనది అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


Similar News