ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..ప్రభుత్వ పథకాలకు మళ్లీ పాత పేర్లు

ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-06-18 13:35 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మార్చుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పథకాలపై ఉన్న జగనన్న పేరును తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనకు ముందు ఉన్న పేర్లను ఉంచుతూ మరి కొన్ని పథకాల పేర్లు మార్చింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు.

*జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌

*జగనన్న విదేశీ విద్యా దీవెన- అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి

*వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు- చంద్రన్న పెళ్లికానుక

*వైఎస్‌ఆర్‌ విద్యోన్నతి-ఎన్టీఆర్‌ విద్యోన్నతి

*జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం- సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ప్రోత్సాహకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Read More..

సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు పర్యటన ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం


Similar News