AP High Court: బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

వైసీపీ (YCP) నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ (Borugadda Anil)కు మరోసారి ఏపీ హైకోర్టు (AP High Court)లో చుక్కెదురైంది.

Update: 2025-01-02 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ (Borugadda Anil)కు మరోసారి ఏపీ హైకోర్టు (AP High Court)లో చుక్కెదురైంది. సోషల్ మీడియా (Social Media) వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహరంలో ఇటీవలే ఆయనపై అనంతపురం (Ananthapuram) నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీలు లేదని కోర్టు తెలిపింది. 

Also Read...

Ap News: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య 

Tags:    

Similar News