Breaking: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఆదేశం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది....

Update: 2023-06-02 10:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నికిలీ ధ్రువపత్రాల జారీ ఆరోపణలపై విచారణకువిచారణాధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్‌ను నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీల నుంచి మినహాయింపు కోసం లేఖలు వినియోగిస్తున్నట్లు గుర్తించింది. విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఏపీజీఈఏ లేఖలను నిలిపివేయాలని ఆదేశించింది. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ ఆఫీసు బేరర్ లేఖలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీ జీఈఏ నకిలీ లేఖలు జారీ చేసినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించింది. 

Also Read..

ప్రజల్లోకి టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ స్కీమ్స్ 

Tags:    

Similar News