Ap Capital కేసుపై సుప్రీంకోర్టుకు లేఖ రాసిన ప్రభుత్వం

ఏపీ రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజధాని కేసును త్వరగా విచారించాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది..

Update: 2023-02-04 11:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజధాని కేసును త్వరగా విచారించాలని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నెల 6న విచారించాలని కోరింది.  అలాగే మెన్షన్ లిస్టులో చేర్చాలని రిజిస్ట్రార్‌ను నజ్కీ అభ్యర్థించారు.

కాగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో మూడు రాజధానుల ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అలాగే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఏపీ రాజధాని అమరావతిని వెంటనే అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఒక్క అమరావతినే కాదని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని.. అది ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారిస్తామని పేర్కొంది. విచారణ వాయిదా వేసింది.

అయితే సీఎం జగన్ త్వరలో విశాఖ నుంచి పరిపాలన చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో తమ మార్గం సుగుమం చేసుకోవచ్చని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఈ మేరకు రాజధాని కేసును త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News