వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటన

వరద బాధితుల(flood victims)కు ఏపీ ప్రభుత్వం(AP government) సాయం ప్రకటించింది. 179 సచివాలయాల పరిధిలో ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలని చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు.

Update: 2024-09-17 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరద బాధితుల(flood victims)కు ఏపీ ప్రభుత్వం(AP government) సాయం ప్రకటించింది. 179 సచివాలయాల పరిధిలో ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలని చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుద చేశారు. చరిత్రలో తొలిసారి ఇంటికి రూ.25 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లలో ఉండేవారికి రూ.10 వేల సాయం, చిన్న వ్యాపారులకు రూ.25 వేల సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.

MSME టర్నోవర్ రూ.40 లక్షలలోపు ఉంటే రూ.50 వేలు, రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉంటే రూ.లక్ష, అంతకు మించి టర్నోవర్ ఉంటే రూ.లక్షన్నర సాయం ప్రకటించారు. అవసరమైతే చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఉచితంగా ఇస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. చేనేత కార్మికులకు రూ.15 వేలు, కిరాణాషాపులకు రూ.25 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.9 వేలు, పూర్తిగా దెబ్బతిన్న బోట్లకు రూ.20 వేలు, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు, హెక్టార్‌కు రూ.25 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు.


Similar News