బాలయ్య ‘డాకు మహారాజ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది
దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ(Nadmuri Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj)కు ఏపీ ప్రభుత్వం(అప్ Government) గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సినిమా స్పెషల్ షో ప్రదర్శనతో పాటు టికెట్ల రేట్లు పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. ఈ షోకు టికెట్ ధర రూ.500గా ప్రకటించారు. అలాగే రోజూ ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. తాము ఎంతో కష్టపడి సినిమా తీశామని, తమ శ్రమను ప్రభుత్వం గుర్తించిందని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా బాబీ డైరెక్షన్(Director Babi)లో బాలయ్య హీరోగా ‘డాకు మహారాజ్’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మాత నాగవంశీ(Producer Naga Vamsi) నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి(Sankranti) కానుకగా ‘డాకు మహారాజ్’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ తో పాటు రెండు పాటలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లోని కనిపించిన సీన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ విడుదల కోసం బాలయ్య ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘డాకు మహారాజ్’ మూవీకి తీపికబురు అందించింది.