Dussehra holidays:ఎల్లుండి నుంచి దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్.. ఎప్పటివరకంటే?

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు(Students) గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-01 08:17 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు(Students) గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అక్టోబర్ వచ్చిందంటే విద్యార్థులకు పండగే పండుగ.. ఎందుకంటే ఈ నెలలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో వరుస సెలవులు(Holidays) వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లుండి(అక్టోబర్ 3వ తేదీ) నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే మొదటగా ఈనెల 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించగా.. తాజాగా ఈనెల 3వ తేదీ (గురువారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ఏపీ ప్రభుత్వం(AP Government) అధికారికంగా ప్రకటించింది. దీంతో విద్యార్థులకు మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను నిర్ణయించింది. మళ్లీ పాఠశాలలు అక్టోబర్ 14వ (సోమవారం) తేదీన పున:ప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ రోజు (మంగళవారం) ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు(Private), ప్రభుత్వ స్కూళ్లకు(Govt School) ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఎల్లుండి (అక్టోబర్ 3) నుంచి అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో తొమ్మిది రోజులు పండుగ వాతావరణం నెలకొననుంది.




 



Similar News