AP Assembly Sessions: నల్ల కండువాతో అసెంబ్లీకి వచ్చిన జగన్.. సభ నుంచి వైఎస్ఆర్సీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి.

Update: 2024-07-22 05:20 GMT
AP Assembly Sessions: నల్ల కండువాతో అసెంబ్లీకి వచ్చిన జగన్.. సభ నుంచి వైఎస్ఆర్సీ వాకౌట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ముందుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ అవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా నల్ల కండువాలు మెడలో వేసుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు కండువాలు తీసెయ్యాలంటూ నాయకులను అడ్డుకోగా జగన్ వారితో విగ్వాదానికి దిగి నల్ల కండువాలతోనే సభలోకి వెళ్లారు. అనంతరం సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా.. వైసీపీ సభ్యులు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాసిన స్క్రీప్ట్ గవర్నర్ ప్రసంగిస్తున్నారంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్టులు కూడా ప్రదర్శించారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తుండగానే.. వైసీపీ నాయకులు సభ నుంచి వాకౌట్ అయ్యారు. 

Read More..

Breaking: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై జగన్ తీవ్ర ఆగ్రహం 

Tags:    

Similar News