ఏపీకి సమీపంలో మరో అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి సమీపంలో మరో అల్పపీడనం

Update: 2024-09-05 03:40 GMT
ఏపీకి సమీపంలో మరో అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: గత వారం నుంచి కురుస్తున్న వానలకు అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు ముంచుకొస్తోంది. మరోసారి వరుణుడు విజృభించనున్నాడని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో ఏపీలోతేలిక పాటి జల్లుల నుంచి మొదలయ్యి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తరాంధ్రలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మూడు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అంటున్నారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కాబట్టి అక్కడ ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

"ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా లో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకధాటిగా పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడొచ్చు. ఏపీకి దగ్గరలో ఈ అల్పపీడనం ఏర్పడడటం వలన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా చూపుతుందని ” అని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News