ఆ ధర్మాన్నే పవన్ కళ్యాణ్ పాటిస్తాడు.. నాగబాబు మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

Update: 2024-09-26 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ దీక్షపై జనసేన నేత, కొణిదెల నాగబాబు(Konidela Nagababu) మరో ట్వీట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ‘నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని ‌సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం. ఆ ధర్మాన్నే పవన్ కళ్యాణ్ పాటిస్తాడు. ఎన్నో మీటింగ్స్ ఉధృత స్థాయిలో జరుగుతున్నపుడు మజీద్ నుంచి అజాన్ వస్తే తన స్పీచ్‌ని అజాన్ పూర్తయే దాక ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడు పవన్ కళ్యాణ్.

అది పర మతానికి అతనిచ్చే గౌరవం, మర్యాద.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారు.. అతను మతఛాందస్స వాది కాదు హిందూ మతాన్ని గౌరవించాలి హిందూ ఆచారాలని రక్షించాలని పాటుపడేవాడు. హిందూ మత ధర్మ పరిరక్షణలో ఆయన పోరాటం క్రైస్తవుల మీద, ముస్లింల మీద కాదు హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులం అని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపెట్టి కొట్టడానికి మాత్రమే. తన పాలనలో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్‌కి ఏ ముస్లింకి బాధ కలిగించవు.. అర్ధం చేస్కోగలరు’ అని నాగబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.



Similar News