Cyber Crimes: ఒక్క అన్‌నౌన్ క్లిక్ తో సర్వనాశనం.. సైబర్ నేరాలపై వంగళపూడి అనిత కీలక వ్యాఖ్యలు

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు మరింత పెరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Update: 2024-08-10 08:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు మరింత పెరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్‌థాన్ పేరుతో పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అనిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమీషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అభినందనలు తెలియజేశారు. టెక్నాటజీ పెరుగిన తర్వాత సైబర్ నేరాలు మరింతగా పెరిగాయని, దేశవ్యాప్తంగా గత నాలుగు నెలల్లో జరిగిన సైబర్ నేరాల్లో 1700 కోట్లు పోగోట్టుకున్నారని, బాధితుల్లో ఎక్కువగా చదువున్న వాళ్లే ఉంటున్నారని తెలిపారు.

ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. మన ఫోన్ లో ఉన్న యాప్ లే మనల్సి చెడిపోయేలా చేస్తున్నాయని, ఒక్క అన్‌నౌన్ క్లిక్ తో జీవితం సర్వనాశనం చేసుకుంటున్నామని అన్నారు. ఇన్ స్టంట్ లోన్ యాప్ ద్వారా యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ మధ్యే తనకు కూడా 50 లక్షలు లోన్ ఇస్తామని మెసేజ్ వచ్చినట్లు చెప్పారు. ఒక్క క్లిక్ తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, చిన్న చిన్న పిల్లలు సైబర్ బారిన పడి చనిపోతున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా సైబర్ నేరాలకు బలైన వాళ్లు ఉన్నారని తెలిపారు. సైబర్ నేరానికి గురైన బిటెక్ విద్యార్ధి తన దగ్గరకి వచ్చిందని, తర్వాత కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రతీ జిల్లాలో సైబర్ సెల్ ను ఏర్పాటు చేస్తామని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగేలా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అంతేగాక త్వరలో స్టేట్ సైబర్ సెల్ కో ఆర్డినేషన్ టీంను ఏర్పాటు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు.


Tags:    

Similar News