తిరుమల లడ్డూ తయారీలో అపవిత్రం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ఎంతో ప్రత్యేకమైనది.

Update: 2024-09-24 12:30 GMT

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ఎంతో ప్రత్యేకమైనది. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పవిత్రమైన లడ్డు తయారీ విధానంలో కల్తీ నెయ్యితో పాటు, జంతువుల కొవ్వు, నూనేను వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Issue)పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(Special Investigation Team)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఈ మేరకు సోమవారం సచివాలయంలో పోలీసు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. సుదీర్ఘంగా పలువురు సీనియర్ అధికారుల పేర్లను పరిశీలించి, చర్చించారు.

ఈ భేటీ అనంతరం మంగళవారం సాయంత్రం.. తిరుమల లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై.. విచారణ చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ డీఐజీగా ఉన్న సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించాలని నిర్ణయించారు. అలాగే సభ్యులుగా.. గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు‌లను నియమించారు. కాగా ఈ సిట్ తిరుమల లడ్డూ తయారీ కోసం.. నెయ్యి(Ghee) కొనుగోలు, టెండర్(Tenders) ప్రక్రియపై సిట్ విచారణ చేపట్టనున్నారు. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు.


Similar News