షర్మిలపై వ్యక్తిగత విమర్శలు.. సీఎం జగన్కు స్ట్రాంగ్ వార్నింగ్
సీఎం జగన్ చేస్తున్న వ్యక్తి విమర్శలపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందని పలువురు శ్రేణులు అసభ్యకర దూషణలు, పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగనే ఈ పోస్టుల పెట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయ సాధన సభలో వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను సభా ముఖంగా కడిగిపారేశారు. ‘చెల్లి అని కూడా చూడకుండా సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. డబ్బులతో సైన్యాన్ని ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో నన్ను దూషిస్తున్నారు. ఒకప్పుడు ఇదే చెల్లి జగన్ కోసం పాదయాత్ర చేసింది. 3 కి.మీ పాదయాత్ర చేసి జగన్ పార్టీని నిలబెట్టా. తనపై, తన భర్తపై ఇష్టారాజ్యంగా దూషణలు చేస్తున్నారు. సీఎం జగన్ చేసే ప్రతీది దేవుడు చూస్తున్నారు.’ అని వైఎస్ షర్మిల హెచ్చరించారు.