Breaking: టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్య

కర్నూలు జిలాలో దారుణం జరిగింది..

Update: 2024-08-14 04:04 GMT
Breaking: టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్య
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిలాలో దారుణం జరిగింది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన జరిగింది. గ్రామ సమీపంలో కాపు కాచిన దుండగులు శ్రీనివాసులు కళ్లలో కారంచల్లి వేటకొడవళ్లతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే శ్రీనివాసులు హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు శ్రీనివాసులను చంపింది వైసీపీ కార్యకర్తలేనని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసుల ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోసూరులో భారీగా మోహరించారు. ఆందోళనలు చెలరేగకుండా  పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దర్యాప్తులో వేగం పెంచి శ్రీనివాసులను హతమార్చిన  నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News