Nagababu:అన్ని దేశాలు వారికి సోషల్ మీడియా నిషేధాన్ని విధించాలి.. నాగబాబు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత కాలంలో ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వాటిల్లో సోషల్ మీడియా(Social Media) ముందు ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు.
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వాటిల్లో సోషల్ మీడియా(Social Media) ముందు ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఫేస్‌బుక్(Face Book), ఇన్‌స్టాగ్రామ్(Instagram), టెలిగ్రామ్, ఎక్స్(ట్విట్టర్), ఇతర ప్లాట్‌ఫామ్స్ వాడుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఆస్ట్రేలియా ప్రభుత్వం(Australian Government) పదహారేళ్ల పిల్లలు సోషల్ మీడియా వినియోగం పై కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో మునిగి తేలకుండా కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై జనసేన నేత నాగబాబు(Jana Sena leader Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. అది చాలా మంచి నిర్ణయమని నాగబాబు పేర్కొన్నారు. ‘నేటి పిల్లలు సోషల్ మీడియా చట్రంలో చిక్కుకుని భవిష్యత్తును చేజార్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని దేశాలకి ఆదర్శం. అన్ని దేశాలూ దీన్ని అనుసరిస్తే మనం మంచి సమాజాన్ని, జాతిని, ప్రపంచాన్ని చూస్తాం’ అని ట్వీట్ చేశారు.