విశాఖలో రేపటి నుంచి వ్యవసాయ సదస్సు

కేంద్ర వ్యవ‌సాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ‌ వేదిక‌గా ఈ నెల 18, 19 తేదీల్లో ప్రాంతీయ స్థాయి స‌ద‌స్సు నిర్వహిస్తున్నారు.

Update: 2024-11-17 02:22 GMT

దిశ, ప్రతినిధి విశాఖపట్నం: కేంద్ర వ్యవ‌సాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ‌ వేదిక‌గా ఈ నెల 18, 19 తేదీల్లో ప్రాంతీయ స్థాయి స‌ద‌స్సు నిర్వహిస్తున్నారు. వ్యవ‌సాయ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, చేప‌డుతున్న ప్రాజెక్టులు త‌దిత‌ర అంశాల‌పై స‌ద‌స్సులో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, కేంద్రపాలిత పుదుచ్చేరి నుంచి వ్యవ‌సాయ రంగ నిపుణులు, అధికార ప్రతినిధులు సుమారు 70 మంది హాజరుకానున్నారు. 18న స్థానిక రాడిస‌న్ బ్లూ హోట‌ల్లో ఆవిష్కర‌ణ‌లు, సంస్కర‌ణ‌లు, నూతన వంగ‌డాలు, వ్యవ‌సాయ విధానాలపై చ‌ర్చ ఉంటుంది. రెండో రోజు భీమిలి మండ‌లం మ‌జ్జిపేటలో క్షేత్ర స్థాయి ప‌ర్యట‌నలో ప్రకృతి వ్యవ‌సాయ విధానాలు, పంట‌ల సాగును ప‌రిశీలిస్తారు. అదే గ్రామంలో వివిధ వ్యవ‌సాయ ఉత్పత్తుల ప్రద‌ర్శన ఉంటుంది.


Similar News