Breaking: ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం

ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగింది....

Update: 2024-09-12 04:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి సంధ్యారాణి (AP Minister Sandhya Rani) ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా (Vijayanagaram District) రామభద్రాపురం మండలం భూసాయవలసలో మంత్రి ఎస్కార్ట్‌ వాహనాన్ని వ్యాను ఢీకొట్టింది. మంత్రి సంధ్యారాణి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఘటన జరిగింది. అయితే మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గాయాలైన వారిని మంత్రి సంధ్యారాణి అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి క్షతగాత్రులకు చికిత్స చేయిస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..


Similar News