Accident: అతివేగంగా ఢీకొన్న రెండు కార్లు.. బాలిక పరిస్థితి సీరియస్

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ..

Update: 2024-12-14 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈపూరు- కూచినపల్లి(Eepur- Kuchinapally) మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు(Cars) బలంగా ఢీకొన్నాయి. అంతేకాదు ఢీ కొట్టిన తర్వాత రెండు కార్లు అంతే వేగంగా వెనక్కి వెళ్లాయి. ఓ కారు ఏకంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కార్లు ఢీకొన్న తీరును చూసి షాక్ అయ్యారు. పరిమితికి మించి రెండు కార్లు అతివేగంగా వచ్చినట్లు అంచనావేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News