Cm Jagan: వైసీపీలో సంచలన పరిణామం.. ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు

విశాఖ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది...

Update: 2024-09-26 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ వైసీపీ(Visakha Ycp)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు(Former Deputy CM Muthyalanaidu), మాజీ మంత్రి అమర్‌నాథ్‌(Former minister Amarnath)కు అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతం దృష్టి పెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan MohanReddy).. పాత అధ్యక్షులను మార్చారు. కొత్త అధ్యక్షుల నియామకంపై కసరత్తులు చేశారు. విశాఖ జిల్లాలోని పలువురు నాయకుల పేర్లను పరిశీలించారు. అనంతరం మూడు జిల్లాలకు అధ్యక్షులకు నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్ నాథ్‌, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు (Paderu Mla VisweswaraRaju)ను నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో ఈ రోజు సమావేశమైన ఆయన విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు కొత్త వైసీపీ అధ్యక్షులను ప్రకటించారు.


Similar News