Tirumala : తిరుమలలో ఘనంగా గోపూజోత్సవం
తిరుమల(Tirumala) టీటీడీ(TTD) ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం(Cow Worship Ceremony) ఘనంగా నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) టీటీడీ(TTD) ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం(Cow Worship Ceremony) ఘనంగా నిర్వహించారు. ఎస్వీ గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాంప్రదాయబద్ధంగా గోపూజను నిర్వహించారు. ఈ గోపూజ కార్యక్రమానికి టీటీడీ పాలక మండల సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి(Bhanuprakash Reddy)హాజరయ్యారు.
ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ దేశీ ఆవుల సంరక్షణకు టీటీడీ కృషి చేస్తుందని భాను ప్రకాష్ రెడ్డిఅన్నారు. గోమాత..భూమాత..తులసీమాత మాతృమూర్తితో సమానమని, గోవుల సంరక్షిస్తూ వాటి పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సూచించారు. టీటీడీ గోశాల ద్వారా ఆవులను పరీక్షిస్తూ వాటి సంతతిని పెంపొందిస్తుందన్నారు. అలాగే దేశీ ఆవులను పెంచుకుంటామనే వారికి టీటీడీ గోదానం కూడా చేస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గోసంరక్షణ మిషన్ ద్వారా టీటీడీని అనుసంధానం చేసి దేశీయ గో జాతీ అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్ర మాలను నిర్వహించారు.