తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించిన కర్ణాటక భక్తుడు
టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి, దాత అందజేశారు
దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారికి భక్తులు పోటీ పడుతూ విరాళలు అందిస్తారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ టి.బాలసుదర్శన్‌రెడ్డి బర్డ్ ట్రస్టుకు 70 లక్షలా ఏడు వేలా 700 రూపాయలు విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి, దాత అందజేశారు. ఏడు కొండలకు సూచికగా ఈ విరాళాన్ని అందించినట్టు దాత తెలిపారు.ఈ కార్యక్రమంలో బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.