అంగారకుడిపై మంచు మేఘాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

దిశ, ఫీచర్స్ : మార్స్(అంగారకుడు)పై జీవాన్వేషణ ఈనాటిది కాదు. ఏళ్ల తరబడిగా ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే మార్స్‌పైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన ‘పర్సెవరెన్స్ రోవర్’ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. రోవర్ నుంచి ‘ఇన్‌జెన్యూటీ’ అనే హెలికాప్టర్ మార్స్ వీధుల్లో విహరించి అక్కడి వాతావారణ ఫొటోలను భూమ్మీదకు పంపుతోంది. ఈ మేరకు నాసా పరిశోధకులు రెడ్ ప్లానెట్‌పై జీవ వాతావరణం ఎలా మాయమైందో తెలుసుకుంటున్నారు. కాగా అంగారకుడిపై […]

Update: 2021-04-27 02:02 GMT

దిశ, ఫీచర్స్ : మార్స్(అంగారకుడు)పై జీవాన్వేషణ ఈనాటిది కాదు. ఏళ్ల తరబడిగా ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే మార్స్‌పైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన ‘పర్సెవరెన్స్ రోవర్’ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. రోవర్ నుంచి ‘ఇన్‌జెన్యూటీ’ అనే హెలికాప్టర్ మార్స్ వీధుల్లో విహరించి అక్కడి వాతావారణ ఫొటోలను భూమ్మీదకు పంపుతోంది. ఈ మేరకు నాసా పరిశోధకులు రెడ్ ప్లానెట్‌పై జీవ వాతావరణం ఎలా మాయమైందో తెలుసుకుంటున్నారు. కాగా అంగారకుడిపై నదులు ఎలా అంతర్థానం అయ్యాయి? అనే విషయమై యూనివర్సిటీ ఆఫ్ చికాగో పరిశోధకులు కొత్త థియరీ ప్రపోజ్ చేశారు. అంగారకుడిపై మంచు మేఘాలతో కూడిన ఒక పొర(లేయర్) ఉందని, దాని ఎఫెక్ట్‌తో నదీజలాలు ఆవిరై పొరగా ఏర్పడి ఉండొచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ స్టడీ వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

3.7 బిలియన్ ఏళ్ల కిందట రెడ్ ప్లానెట్‌పై నీరు ప్రవహించిందని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అయితే ఆ నీటి ప్రవాహం ఎలా కనుమరుగైంది? అనే విషయమే ఇంకా శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కుజుడిపై ఉన్న మంచుతో కూడిన మేఘాల పొర.. ఆ గ్రహంలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చని, తద్వారా నదులు అంతర్థానమయ్యే అవకాశముందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో పరిశోధకుడు ఎడ్విన్ కైట్ వివరిస్తున్నాడు. అయితే తమ అంచనాలు నిరూపించేందుకు ఆధారాలు పూర్తిస్థాయిలో లభించలేదని, ఇది ఒక పరికల్పన మాత్రమేనని పేర్కొన్నాడు. పరిశోధనలో భాగంగా పరిశోధకులు మార్స్ అట్మాస్పియరిక్ కండిషన్స్‌తో 3D కంప్యూటర్ మోడల్ సృష్టించారు. భూమి మాదిరిగానే కుజగ్రహంలో నీరు పుష్కలంగా ఉండేదని ‘వాటర్ వరల్డ్’ అనే పేరు అంగారకుడికి ఇవ్వొచ్చని చెప్తున్నారు. అయితే వారి థియరీ ప్రకారం అంగారకుడిపై అతిపెద్ద ఆస్టరాయిడ్(గ్రహశకలం) పడగా, అది సృష్టించిన గతిశక్తితో ఉష్ణోగ్రతలు పెరిగాయని ఆ ఎఫెక్ట్‌తో నీరు ఆవిరిగా మారిందని అంటున్నారు.

భూమిపై కార్బన్‌డయాక్సైడ్ ఎఫెక్ట్ మాదిరిగానే మార్స్‌పై గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉందని, గ్రహ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలను మంచు మేఘాలు ప్రభావితం చేశాయని పరిశోధకుడు డాక్టర్ కైట్ వెల్లడించారు. ఈ ఐడియా(మంచు మేఘాలు) బేసిస్‌పై 2013 నుంచి తాము పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. మార్షియన్ అట్మాస్పియర్‌లో నీటి ప్రవాహం ఏడాది పాటు ప్రవహించిందని, ఆ పరిస్థితులు అత్యధిక సాంద్రత కలిగిన మంచు మేఘాల ఏర్పాటుకు దోహదపడ్డాయని తమ కంప్యూటర్ మోడల్ ద్వారా తేలిందని వివరించారు. భూమి తర్వాత మానవాళి నివాసానికి ఆమోదయోగ్యమైన ప్లానెట్ మార్స్ మాత్రమేనని, ఎందుకంటే భూ వాతావరణ పరిస్థితులు అంగారకుడిపై తప్ప. ఏ ఇతర గ్రహాల్లో లేవని నిర్ధారించారు. నాసా పరిశోధకులు కూడా నీరు మంచురూపంలో గడ్డకట్టిందని భావిస్తున్నారు. వాటిపై అణుబాంబులు వేసి నీటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News