Anasuya Bharadwaj : స్టార్ హీరోని ఆకాశానికెత్తేసిన హాట్ యాంకర్.. ఫిదా అయిపోయానంటూ

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే ఆమె నటించిన ‘థాంక్యూ బ్రదర్’ ఓటిటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ లాక్ డౌన్ సమయంలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ కనిపిస్తుంది. తాజాగా ఆమె అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంది. ఇక ఈ సెషన్ లో ఓ నెటిజన్ ‘పుష్ప’ చిత్రంలో నటించారు కదా.. […]

Update: 2021-05-23 05:15 GMT
Anasuya Bharadwaj : స్టార్ హీరోని ఆకాశానికెత్తేసిన హాట్ యాంకర్.. ఫిదా అయిపోయానంటూ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే ఆమె నటించిన ‘థాంక్యూ బ్రదర్’ ఓటిటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ లాక్ డౌన్ సమయంలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ కనిపిస్తుంది. తాజాగా ఆమె అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంది. ఇక ఈ సెషన్ లో ఓ నెటిజన్ ‘పుష్ప’ చిత్రంలో నటించారు కదా.. అల్లు అర్జున్ గురించి చెప్పండి అని అడిగాడు. పుష్ప చిత్రంలో తానూ కొద్దిసేపే కనిపిస్తానని, నాలుగు రోజులే తానూ షూటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది.

ఇక బన్నీ గురించి చెప్తూ.. సెట్ లో ఉన్న నాలుగు రోజుల్లోనే బన్నీ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయానని, తన ప్రతిసినిమాను బన్నీ మొదటి సినిమాలా ఫీలై చేస్తారని చెప్పుకొచ్చింది. తనది కష్టపడే తత్త్వమని, పనిమీద నిబద్దత కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఇక ‘పుష్ప’ సినిమాలో బన్నీ నటనకు అభిమానులు పిచ్చెక్కిపోతారని, సుకుమార్ తో కలిసి రెండోసారి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో అనసూయ ‘రంగస్థలం’లో రంగమత్తగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News