కళాత్మక కూలీ పనికి.. ఆనంద్ మహీంద్ర ఫిదా!

దిశ, ఫీచర్స్ : నెటిజన్లలో స్ఫూర్తినింపేందుకు నిత్యం బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతా ద్వారా ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్‌లు పంచుకుంటూ ఉంటాడు. టాలెంటెడ్ పీపుల్ కనిపిస్తే చాలు, వారిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు, వారి ప్రతిభను పొగడటానికి ముందుంటాడు. తలపై ఇటుకల కుప్పను బ్యాలెన్సింగ్ చేస్తున్న ఓ కూలీ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నాడు ఆనంద్ మహీంద్ర. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఆ వీడియో విశేషాలు. 57 సెకన్ల వీడియోలో, ఒక వ్యక్తి తన తలపై […]

Update: 2021-08-16 09:34 GMT

దిశ, ఫీచర్స్ : నెటిజన్లలో స్ఫూర్తినింపేందుకు నిత్యం బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతా ద్వారా ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్‌లు పంచుకుంటూ ఉంటాడు. టాలెంటెడ్ పీపుల్ కనిపిస్తే చాలు, వారిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు, వారి ప్రతిభను పొగడటానికి ముందుంటాడు. తలపై ఇటుకల కుప్పను బ్యాలెన్సింగ్ చేస్తున్న ఓ కూలీ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నాడు ఆనంద్ మహీంద్ర. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఆ వీడియో విశేషాలు.

57 సెకన్ల వీడియోలో, ఒక వ్యక్తి తన తలపై ఇటుకలను ఒకదానితో ఒకటి పేర్చుకుంటూ మొత్తంగా ముప్పైకి పైగా ఇటుకలను పెట్టుకుని ఆశ్చర్యపరిచాడు. అతడి కళాత్మక ప్రతిభకు, శారీరక శ్రమకు ఫిదా అయిన మహీంద్ర ఆ వ్యక్తి యొక్క అసాధారణ నైపుణ్యాలను ప్రశంసించాడు. ‘ఎవరూ అలాంటి ప్రమాదకర శారీరక శ్రమ చేయాలనుకోరు. కానీ ఈ వ్యక్తి తన శ్రమను కళారూపంగా మార్చినందుకు మీరు ఆభినందించాలి. ఈ వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నాడో ఎవరికైనా తెలుసా? అతని యజమానులు ఆటోమేషన్‌ను అందించగలరా & అతని ఉన్నత-స్థాయి నైపుణ్యాలను గుర్తించగలరా’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశాడు. ఆటోమేషన్ వల్ల ఆ కార్మికుడే కాదు చాలా మంది కూలీలు తమ ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తుంది అని నెటిజన్లు సూచించారు.

Tags:    

Similar News