రైతు తన చితిని తానే పేర్చుకొని మరణిచడం బాధాకరం : రఘునందన్ రావు

దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజక వర్గానికి చెందిన వేముల ఘాట్ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి తన చితిని తానే పేర్చుకొని తనువు చాలించడం హృదయ విదారకమైన సంఘటన అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవేదన వ్యక్తపరిచారు. శుక్రవారం చనిపోయిన రైతు మృత దేహాన్ని సిద్దిపేట మార్చురీ లో సందర్శించి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం విలేకరులతో రఘు నందన్ రావు మాట్లాడుతూ వేముల ఘాట్ లో హృదయ విదారక సంఘటన […]

Update: 2021-06-18 03:15 GMT

దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజక వర్గానికి చెందిన వేముల ఘాట్ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి తన చితిని తానే పేర్చుకొని తనువు చాలించడం హృదయ విదారకమైన సంఘటన అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవేదన వ్యక్తపరిచారు. శుక్రవారం చనిపోయిన రైతు మృత దేహాన్ని సిద్దిపేట మార్చురీ లో సందర్శించి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం విలేకరులతో రఘు నందన్ రావు మాట్లాడుతూ వేముల ఘాట్ లో హృదయ విదారక సంఘటన జరిగిందని రైతు మల్లారెడ్డి గ్రామంతో, తన ఇంటితో ఉన్నా అనుబంధాన్ని తెంచుకొలేక ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడం బాధాకరమన్నారు. రైతు తన చితి తానే పేర్చుకొని తనను తాను సజీవదహనం చేసుకున్నాడాంటే మనం కట్టే ప్రాజెక్ట్ లు, అభివృద్ది అంతా డొల్ల అనేది నిజమైందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి పక్షాలు మాట్లాడుతే అవహేళన చేసే టీఆర్ఎస్ నాయకులకు రైతుల ఆత్మహత్యలు కనబడటం లేదా అని ప్రశ్నించారు.

రైతు తన ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకోవడం చూసైనా ప్రభుత్వం కళ్లు తెరచి వేములఘాట్ రైతులకు న్యాయం చేయాలని అన్నారు.వేల కోట్ల రూపాయలు కుర్చీలకు,ఏసి లకు,రంగుల పేరిట ఖర్చు చేసే అధికారులు,రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తాము ప్రశ్నించు కోవాలి అని సూచించారు. సిద్దిపేట పర్యటనకు వచ్చే సీఎం కెసీఆర్ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో మిగిలి పోయిన రైతుల గురించి ఆలోచించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పగులుతున్న గుండెలను, మండుతున్నా చితి మంటలను చూసైనా జిల్లా అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు.

ఇలాంటి సంఘటనలు మీ కుటుంబాలలో జరుగుతే ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలని ఆయన హితవు పలికారు. అధికారులు తమకర్తవ్యాన్ని తాము నిర్వహిస్తే మల్లారెడ్డి తన చితిని తానే పెర్చుకోనే దుస్థితి వచ్చేది కాదన్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం,ప్రజా ప్రతినిధులు దళారులను నమ్మకుండా మిగిలిన రైతుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించాలని ఆయన అన్నారు. మల్లారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రఘునందన్ రావు హెచ్చరించారు. ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఉంటే పోరాటం చేద్దాం కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు, వెంకట్, నవీన్, ప్రవీణ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News