అస్సాంలో భూకంపం ధాటికి కూలిన గోడలు.. జనం పరుగులు

గువహతి : ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ రోజు ఉదయం 7.51 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తర్వాత వెనువెంటనే మరో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. దాదాపు 30 సెకండ్లు భూమి కంపించడాన్ని పరిశీలించామని స్థానికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసోం తేజ్‌పూర్‌లో కేంద్రీకృతమైన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. Few early pictures of damage in Guwahati. pic.twitter.com/lTIGwBKIPV — Himanta Biswa Sarma (@himantabiswa) April […]

Update: 2021-04-27 21:51 GMT
అస్సాంలో భూకంపం ధాటికి కూలిన గోడలు.. జనం పరుగులు
  • whatsapp icon

గువహతి : ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ రోజు ఉదయం 7.51 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తర్వాత వెనువెంటనే మరో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. దాదాపు 30 సెకండ్లు భూమి కంపించడాన్ని పరిశీలించామని స్థానికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసోం తేజ్‌పూర్‌లో కేంద్రీకృతమైన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది.

ఫలితంగా అసోం, ఈశాన్యప్రాంతాలు, ఉత్తర బెంగాల్‌లో ప్రకంపనాలు సంభవించాయి. ప్రధానంగా 7.51 గంటలకు భూమి కంపించగా, తర్వాతే 7. 55 గంటలకు, అటుతర్వాత మరోసారి 4.3, 4.4 తీవ్రతలతో భూమి కంపించింది. భూకంపంపై రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. భారీ భూకంపాన్ని గమనించామని, వివరాల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. అక్కడక్కడ నివాసాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయని స్థానికులు చెప్పారు.

 

Tags:    

Similar News