అమూల్​ ఒక్క పైసా పెట్టుబడి పెట్టలేదు: నారా లోకేశ్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో అమూల్ సంస్థ ఒక్క పైసా పెట్టుబడి పెట్టడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తెలిపారు. ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ… అమూల్ కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించారు. రూ.3 వేల కోట్లతో బల్క్ చిల్లింగ్ స్టేషన్‌లను అమూల్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అసలూ వడ్డీ కలిపి ఏడాదికి రూ.500 కోట్లను ప్రభుత్వం కట్టాలన్నారు. ప్రజాధనాన్ని వడ్డీల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని […]

Update: 2020-12-02 11:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో అమూల్ సంస్థ ఒక్క పైసా పెట్టుబడి పెట్టడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తెలిపారు. ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ… అమూల్ కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శించారు. రూ.3 వేల కోట్లతో బల్క్ చిల్లింగ్ స్టేషన్‌లను అమూల్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అసలూ వడ్డీ కలిపి ఏడాదికి రూ.500 కోట్లను ప్రభుత్వం కట్టాలన్నారు. ప్రజాధనాన్ని వడ్డీల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని లోకేశ్ ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆస్తులను అప్పజెప్పితే సహకార డెయిరీలు అమూల్ కంటే ఎక్కువే ఇవ్వగలవన్నారు. రాష్ర్టంలో డెయిరీలను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేశ్ విమర్శించారు.

Tags:    

Similar News