అమ్మోనియం నైట్రేట్ నిల్వల తరలింపు..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మూడో విడత అమ్మోనియం నైట్రేట్ నిల్వల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 22 కంటైనర్ల ద్వారా నైట్రేట్ నిల్వలను అధికారులు తరలించారు. గురువారం మరో 15 కంటైనర్ల ద్వారా వాటిని తరలిస్తున్నారు. మొత్తంగా 697 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నిల్వలను చైన్నై నుంచి 37 కంటైనర్ల ద్వారా హైద్రాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, చైన్నైలోని అమ్మోనియం నిల్వలను పూర్తిగా హైద్రబాద్‌కు తరలించామని.. స్థానికులు, మత్స్య కారులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు భరోసానిచ్చారు. […]
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణలో మూడో విడత అమ్మోనియం నైట్రేట్ నిల్వల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 22 కంటైనర్ల ద్వారా నైట్రేట్ నిల్వలను అధికారులు తరలించారు. గురువారం మరో 15 కంటైనర్ల ద్వారా వాటిని తరలిస్తున్నారు.
మొత్తంగా 697 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నిల్వలను చైన్నై నుంచి 37 కంటైనర్ల ద్వారా హైద్రాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, చైన్నైలోని అమ్మోనియం నిల్వలను పూర్తిగా హైద్రబాద్‌కు తరలించామని.. స్థానికులు, మత్స్య కారులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు భరోసానిచ్చారు.
ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరో 2000మందికి పైగా గాయాలపాలయ్యారని సమాచారం. అలాంటి ఘటన మనవద్ద కూడా జరగొచ్చని నిపుణులు హెచ్చరించడంతో చైన్నై నుంచి వాటిని సేఫ్‌గా హైద్రాబాద్‌కు తరలించారు.