అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఓ జవాన్ తండ్రి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా షేర్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఈ సమయంలో రాజకీయం చేయడం తగదన్నారు. అయితే.. ఆ వీడియోలో ఏమున్నదంటే.. భారత్-చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణల్లో పోరాడి గాయపడిన ఓ జవాన్ తండ్రి.. కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలపై మాట్లాడారు. ‘ రాహుల్ జీ.. చైనా-భారత్ సరిహద్దు ఘటనకు మీరు రాజకీయ కోణానికి అంటగట్టొద్దు. […]
దిశ, వెబ్ డెస్క్: ఓ జవాన్ తండ్రి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా షేర్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఈ సమయంలో రాజకీయం చేయడం తగదన్నారు. అయితే.. ఆ వీడియోలో ఏమున్నదంటే.. భారత్-చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణల్లో పోరాడి గాయపడిన ఓ జవాన్ తండ్రి.. కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలపై మాట్లాడారు. ‘ రాహుల్ జీ.. చైనా-భారత్ సరిహద్దు ఘటనకు మీరు రాజకీయ కోణానికి అంటగట్టొద్దు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు. భారత సైన్యం బలమైన సైన్యం. చైనాను ఓడించగలదు. నా కొడుకు భారత సైన్యంలో పోరాడాడు. కోలుకున్నంక మళ్లీ పోరాడుతాడు’ అని ఆయన పేర్కొన్నారు.
A brave armyman’s father speaks and he has a very clear message for Mr. Rahul Gandhi.
At a time when the entire nation is united, Mr. Rahul Gandhi should also rise above petty politics and stand in solidarity with national interest. https://t.co/BwT4O0JOvl
— Amit Shah (@AmitShah) June 20, 2020