నాలుగేళ్లుగా డిప్రెషన్లో అమీర్ డాటర్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ లాస్ట్ ఇయర్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఒక్క సినిమాతోనే టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. అంత గొప్ప ప్రతిభ ఉండి, సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. తను డిప్రెషన్‌తో బాధపడ్డానని తెలిపింది ఐరా. నాలుగేళ్లు మానసిక సమస్యతో బాధపడిన తను ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయినట్లు చెప్పింది. ‘ఏడాదిగా ఆరోగ్యంగా ఉంటున్నాను.. కానీ మెంటల్ ఇల్‌నెస్‌తో బాధపడేవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా.. […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ లాస్ట్ ఇయర్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఒక్క సినిమాతోనే టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. అంత గొప్ప ప్రతిభ ఉండి, సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. తను డిప్రెషన్‌తో బాధపడ్డానని తెలిపింది ఐరా. నాలుగేళ్లు మానసిక సమస్యతో బాధపడిన తను ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయినట్లు చెప్పింది. ‘ఏడాదిగా ఆరోగ్యంగా ఉంటున్నాను.. కానీ మెంటల్ ఇల్‌నెస్‌తో బాధపడేవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా.. అయితే ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియడం లేదు. అందుకే తన ప్రయాణంలోకి తీసుకెళ్లబోతున్నా’ అని తెలిపింది. పర్సనల్‌గా తన బాధల గురించి చెప్తూ.. మన గురించి మనం అర్థం చేసుకుని ఈ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలని చెప్పింది.
అసలు నేను ఎవరిని? ఎందుకు డిప్రెషన్‌కు గురి కావాలి? అన్నీ ఉన్నా సరే, డిప్రెషన్ చెందాల్సిన అవసరం ఏంటి? అని తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించింది. ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా చాలా చెప్పాలి అనుకుంటారు. పరిస్థితులు కొన్ని స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాయి. కన్ఫ్యూజన్ ఉంటుంది.. ఒక్కోసారి ఉండదు. సంతృప్తి ఉంటుంది.. కొన్నిసార్లు ఉండదు. ఒకసారి ఓకే అనిపిస్తుంది.. మరోసారి నాట్ గుడ్ అనిపిస్తుంది. లైఫ్ వీటన్నిటి కలయిక.. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ మనం స్ట్రాంగ్‌గా ఎలా ఉండొచ్చు అని వివరించింది అమీర్ ఖాన్ కూతురు.