అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త
వాషింగ్టన్ : అమెరికాలో ఉంటూ.. త్వరలోనే వీసా గడువు ముగుస్తున్న భారతీయులకు అక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన వారి వీసా పొడిగింపు అభ్యర్థనలను పరిశీలిస్తామని ప్రకటించింది. ఈ మేరకు వారి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెలువరించింది. కరోనా కారణంగా అమెరికాలో చిక్కుకొని పోయిన భారతీయ పౌరుల హెచ్1-బీ వీసాలతో సహా పలు రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. ఈ అభ్యర్థనను […]
వాషింగ్టన్ :
అమెరికాలో ఉంటూ.. త్వరలోనే వీసా గడువు ముగుస్తున్న భారతీయులకు అక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన వారి వీసా పొడిగింపు అభ్యర్థనలను పరిశీలిస్తామని ప్రకటించింది. ఈ మేరకు వారి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెలువరించింది. కరోనా కారణంగా అమెరికాలో చిక్కుకొని పోయిన భారతీయ పౌరుల హెచ్1-బీ వీసాలతో సహా పలు రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన హోం ల్యాండ్ సెక్యూరిటీ వీసాల గడువు పొడగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. హోం ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయంతో అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. కాగా, వలసదారులు వీసా గడువు ముగిసిన తర్వాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడగింపు లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దీని ద్వారా దేశ బహిష్కరణ వంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. హెచ్1బీ వీసాదారులు కరోనా మహమ్మారి సమయంలోనే ఉద్యోగాలు కోల్పోయినట్లయితే వాళ్లు 60 రోజుల్లో అమెరికా వదలి వెళ్లాలి. కాని ఇప్పుడు దాన్ని 8 నెలలకు పెంచినట్లు తెలిపింది.
Tags: visa, validity, extension, america, indian origins, nri