అంబులెన్స్ చార్జి.. కిలో మీటరుకు రూ.3888 మాత్రమే!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే కాదు.. మెడికల్ మాఫియా కూడా చెలరేగి పోయింది. వీరికితోడుగా తాజాగా అంబులెన్స్ యజమానులు నిలువు దోపిడీ చేస్తున్నారు. కేవలం 5-10 కిలోమీటర్ల దూరానికి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.. ఇక వందల కిలోమీటర్లు ఉంటే లక్షకు పైగా వసూలు చేస్తున్నారు. శవాలతో బేరాలు చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి తన కూతురు శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన కారులో […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే కాదు.. మెడికల్ మాఫియా కూడా చెలరేగి పోయింది. వీరికితోడుగా తాజాగా అంబులెన్స్ యజమానులు నిలువు దోపిడీ చేస్తున్నారు. కేవలం 5-10 కిలోమీటర్ల దూరానికి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.. ఇక వందల కిలోమీటర్లు ఉంటే లక్షకు పైగా వసూలు చేస్తున్నారు. శవాలతో బేరాలు చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి తన కూతురు శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన కారులో మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది.
రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలను మరోసారి బయట పెట్టింది. రాజస్థాన్ నగరంలో ఓ 35 ఏళ్ల మహిళ కరోనాతో కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న తన సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి తండ్రి అంబులెన్స్ ను మాట్లాడారు. వారు ఏకంగా రూ.35 వేలు డిమాండ్ చేశారు. కానీ అంత డబ్బు చెల్లించుకోలేనని ఎంత బతిమిలాడినా వారు వినలేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తండ్రి తన కూతురు శవాన్ని కారులోనే కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలను అక్కడి జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.