అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న జెఫ్ బెజోస్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వ్యవస్థపకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న జెఫ్ బెజోస్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అమెజాన్ సీఈఓ పదని నుంచి తాను తప్పుకోనున్నట్టు ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం తర్వాత బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. జెఫ్ బెజోస్ తర్వాత ఆయన స్థానంలో ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఆండీ జెస్సీని సీఈవోగా నియామకం కానున్నారు. 1994లో అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా […]

Update: 2021-02-03 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వ్యవస్థపకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న జెఫ్ బెజోస్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అమెజాన్ సీఈఓ పదని నుంచి తాను తప్పుకోనున్నట్టు ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం తర్వాత బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. జెఫ్ బెజోస్ తర్వాత ఆయన స్థానంలో ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఆండీ జెస్సీని సీఈవోగా నియామకం కానున్నారు. 1994లో అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయించేందుకు ప్రారంభిచిన అమెజాన్, అనంతర కాలంలో ఆన్‌లైన్ మార్కెట్‌లో ఎవరూ ఊహించని విధంగా ఎదిగింది. ఈ-కామర్స్, రిటైల్ రంగంలో నూతన ఒరవడిని అమెజాన్ తీసుకొచ్చింది. 1996 నుంచి జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవోగా వ్యవహరిస్తుండగా, అప్పటి నుంచి అమెజాన్ ఎదుగుదలకు అనేక వ్యూహాలను, ప్రణాళికలను తనదైన శైలిలో అమలు పరిచారు. ముఖ్యంగా ప్రజల ఆలోచనా సరళిని, భవిష్యత్తు అవసరాలను ముందుగానే పసిగట్టి వ్యాపారాన్ని విజయవంతం చేశారు. తక్కువ కాలంలోనే అమెజాన్‌ను ప్రపంచ దిగ్గజంగా మార్చారు.

కారణమేంటి…
అయితే, ఇటీవల మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్ అధినేత నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించి జెఫ్ బెజోస్ ఉద్యోగులకు రాసిన లేఖలో.. అమెజాన్‌ను ఇప్పటివరకు దగ్గరుండి అన్నీ చూసుకున్నానని, ఇప్పుడు ఆ పదవి నుంచి మారే సమయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బాధ్యతల నుంచి తప్పుకొని ఆండీ జెస్సీకి అప్పగిస్తానని పేర్కొన్నారు. కాగా, బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా, బెజోస్ ఎర్త్ ఫండ్, అమెజాన్ డే 1 ఫండ్, బ్లూ ఆరిజిన్‌లపై మరింత దృష్టి సారించనున్నట్టు వివరించారు. అమెజాన్ కొత్త సీఈవోగా రానున్న ఆండీ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. అనంతరం 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ఏర్పాటులో కీలకపాత్ర వహించారు. ఆండీ జెస్సీ సారథ్యంలో అమెజాన్ మరింత వృద్ధిని సాధిస్తుందని నమ్ముతున్నట్టు బెజోస్ చెప్పారు. తన తర్వాత ఎక్కువ అనుభవం ఉనందని ఆయనకేనని తెలిపారు. అయితే, అనూహ్యంగా అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోవడానికి మాత్రం కారణాలను వెల్లడించలేదు. వ్యక్తిగా కారణాలే అయ్యుండొచ్చనే అభిప్రాయం కంపెనీ వర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News