యూజర్లకు అమెజాన్ ప్రైమ్ షాక్..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. త్వరలో తమ సబ్‌స్క్రిప్షన్ల ధరలను భారీగా పెంచడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలపరిమితి కలిగిన సబ్‌స్క్రిప్షన్లతో పాటు ఇతర ప్లాన్‌ల ధరలు కూడా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఎప్పటి నుంచి పెంపు నిర్ణయం ఉంటుందనేది స్పష్టం చేయనప్పటికీ, దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ధరల పెంపు ఉండనున్నట్టు వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర ఏకంగా 50 […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. త్వరలో తమ సబ్‌స్క్రిప్షన్ల ధరలను భారీగా పెంచడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలపరిమితి కలిగిన సబ్‌స్క్రిప్షన్లతో పాటు ఇతర ప్లాన్‌ల ధరలు కూడా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఎప్పటి నుంచి పెంపు నిర్ణయం ఉంటుందనేది స్పష్టం చేయనప్పటికీ, దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ధరల పెంపు ఉండనున్నట్టు వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర ఏకంగా 50 శాతం పెంపుతో రూ. 999 నుంచి రూ. 1,499కి చేరుకోనుంది.
అలాగే, నెలవారీ, త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ల ధరలు కూడా పెంచనున్నట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 129 నుంచి రూ. 179కి, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ రూ. 329 నుంచి రూ. 459కి పెంచనున్నారు. భారత్‌లో అమెజాన్ ప్రైమ్ సేవలు ప్రారంభించి ఐదేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అమెజాన్ పండుగ సీజన్ అమ్మకాలను దీపావళి వరకు కొనసాగిస్తోంది. ఈ సేల్ ముగిసిన తర్వాత కొత్తగా పెంచబోయే సబ్‌స్క్రిప్షన్ల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి ఇప్పుడున్న ధరలే వర్తిస్తాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ధరలు ఈ స్థాయిలో పెంచేందుకు గల కారణాలపై మాత్రం కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.