ఏపీలో దంచికొడుతున్న వానలు.. ఇంకెన్ని రోజులంటే ?

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా – ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం నెలకొన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది. అలాగే కోస్తాంధ్రలోని పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు విపత్తుల […]

Update: 2021-09-06 09:13 GMT
rains
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా – ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం నెలకొన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది. అలాగే కోస్తాంధ్రలోని పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ప్రకటనలో తెలిపింది. అల్పపడీన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఈ మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News