డైరెక్టర్‌తో పెళ్లి.. నాన్న మరణం.. పూర్తిగా మార్చేశాయి : అమలా పాల్

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అమలాపాల్ ఇండస్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 17 ఏళ్ల వయసులో పరిశ్రమకు పరిచయమైన ఆమె.. తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్‌లో స్టార్‌గా గుర్తింపు పొందింది. అయితే ఇన్నేళ్లలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్‌ను సపరేట్‌గా ఎలా డీల్ చేయాలో తెలియక 2019 వరకు అలాగే ఉన్నానని, 2020లో నాన్న చనిపోయాక ఒంటరిదాన్ననే ఫీలింగ్ మొదలైందని చెప్పింది. అయితే అప్పటి వరకు జరిగిన సంఘటనలపై నియంత్రణ లేదని అర్థం చేసుకున్నాక.. పూర్తి […]

Update: 2021-07-14 07:08 GMT
డైరెక్టర్‌తో పెళ్లి.. నాన్న మరణం.. పూర్తిగా మార్చేశాయి : అమలా పాల్
  • whatsapp icon

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అమలాపాల్ ఇండస్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 17 ఏళ్ల వయసులో పరిశ్రమకు పరిచయమైన ఆమె.. తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్‌లో స్టార్‌గా గుర్తింపు పొందింది. అయితే ఇన్నేళ్లలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్‌ను సపరేట్‌గా ఎలా డీల్ చేయాలో తెలియక 2019 వరకు అలాగే ఉన్నానని, 2020లో నాన్న చనిపోయాక ఒంటరిదాన్ననే ఫీలింగ్ మొదలైందని చెప్పింది. అయితే అప్పటి వరకు జరిగిన సంఘటనలపై నియంత్రణ లేదని అర్థం చేసుకున్నాక.. పూర్తి అటెన్షన్‌తో ముందుకు సాగితే ఫ్యూచర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఎదుగుతాననే నమ్మకం వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, వర్క్ లైఫ్ సెపరేషన్ అనే ఆర్ట్ మీద ప్రాక్టీస్ చేస్తున్నానని, ఇందులో ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నానని చెబుతూ.. గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్‌ను పెళ్లి చేసుకున్న, ఇప్పటి వరకు తన లైఫ్ ఓపెన్ బుక్ అని అభిప్రాయపడింది అమల. అయితే ప్రతీ ఒక్కరు ఒక్కో దశలో మారుతారని, ప్రస్తుతం తాను తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేసింది. మొత్తానికి తన వ్యక్తిగత జీవితం మీద ప్రజలు నిరంతరం ఆసక్తి కలిగి ఉండేలా డీల్ చేయడం నేర్చుకున్నట్లు చెబుతోంది.

ఆహా ఒరిజినల్స్ ‘కుడి ఎడమైతే’లో పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపించబోతున్న అమలా పాల్.. గతంలో మాదిరిగా ఈ పాత్ర కోసం ఓవర్ ప్రిపరేషన్ కాలేదని చెప్పింది. తనలోని నటిని మాత్రమే ఫాలో కావాలనుకున్నానని వివరించింది. కాగా ప్రజెంట్ మహేష్ భట్ దర్శకత్వంలో వస్తున్న హిందీ వెబ్ సిరీస్‌ షూటింగ్‌తో బిజీగా ఉంది.

Tags:    

Similar News