బన్నీకి నచ్చిన బాలీవుడ్ సినిమాలు

‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం బన్నీ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా చిత్తూరు యాసను నేర్చుకున్న విషయం తెలిసిందే. బన్నీ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కాగా.. ఈ సినిమాతో అన్ని వర్గాల వారికి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నారట ఈ స్టైలిష్ స్టార్. ఈ క్రమంలో […]

Update: 2020-05-25 03:06 GMT

‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం బన్నీ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా చిత్తూరు యాసను నేర్చుకున్న విషయం తెలిసిందే. బన్నీ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కాగా.. ఈ సినిమాతో అన్ని వర్గాల వారికి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నారట ఈ స్టైలిష్ స్టార్. ఈ క్రమంలో బాలీవుడ్ హంగామా అనే పత్రికకు బన్నీ ఇటీవలే ఓ ఇంటర్య్వూ ఇచ్చారు. అందులో ‘బాలీవుడ్ ఇండస్ట్రీపై అభిమానముంది, నాకు ఓ మూడు బాలీవుడ్ సినిమాలంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు.

‘ఐ లవ్ జో జీతా వహీ సికిందర్’ మూవీ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అన్న బన్నీ.. ఆ సినిమాను 20సార్లకు పైగా చూసినట్టు చెప్పారు. అలాగే ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగా’ మూవీని కూడా మల్టిపుల్ టైమ్స్ చూశాడంట. ‘ఆ సినిమా ఎప్పుడు చూసినా.. మ్యాజిక్ మాత్రం అలానే ఉంటుంది. ఇక రణ్‌వీర్ నటించిన ‘గల్లీ బాయ్స్’ను సైతం మూడు నాలుగు సార్లు చూశాను. నాకు పర్సనల్‌గా ర్యాప్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో ఉన్నది ఒరిజనల్ ఇండియన్ ర్యాప్’ అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. తన గురించి చెప్పమంటే.. ‘స్మైలింగ్ స్టైలిష్ అండ్ హ్యాపీ’ అని తెలిపారు. గత పదేళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాలతోపాటు ప్యారాలాల్ సినిమాలు బాగా వృద్ధి చెందాయని.. అందుకు మహానటి సినిమాను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. బాహుబలి కూడా హ్యూజ్ హిట్ సాధించిందని.. ‘తెలుగు సినీపరిశ్రమ మారుతోందని చెప్పడానికి ఈ రెండు సినిమాలు చాలు’ అని బన్నీ వివరించారు.

Tags:    

Similar News