అభిమానిని కలిసిన ఆనందంలో బన్నీ
దిశ, వెబ్ డెస్క్: కథానాయకుడు.. కథను నడిపిస్తాడు. సినిమాను భుజంపై ఎత్తుకుని.. డైలాగ్స్, డాన్స్‌తో మెప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకోసమే ప్రతీ క్షణం పరితపిస్తాడు. మరి అలాంటి కథానాయకుడు ఒక్కసారి నచ్చితే.. వన్స్ మనవాడు అని డిసైడ్ అయితే.. గుండెల్లో గుడి కట్టి దేవుడిలా ఆరాధిస్తారు అభిమానులు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హృదయంలో దాచుకుంటారు. అలాంటి అభిమానిని సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గుంటూరు జిల్లా మాచర్లలోని కంభంపాడుకు చెందిన నాగేశ్వరరావు బన్నీకి వీరాభిమాని. భక్తుడే […]
దిశ, వెబ్ డెస్క్: కథానాయకుడు.. కథను నడిపిస్తాడు. సినిమాను భుజంపై ఎత్తుకుని.. డైలాగ్స్, డాన్స్‌తో మెప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకోసమే ప్రతీ క్షణం పరితపిస్తాడు. మరి అలాంటి కథానాయకుడు ఒక్కసారి నచ్చితే.. వన్స్ మనవాడు అని డిసైడ్ అయితే.. గుండెల్లో గుడి కట్టి దేవుడిలా ఆరాధిస్తారు అభిమానులు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హృదయంలో దాచుకుంటారు. అలాంటి అభిమానిని సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
గుంటూరు జిల్లా మాచర్లలోని కంభంపాడుకు చెందిన నాగేశ్వరరావు బన్నీకి వీరాభిమాని. భక్తుడే అనుకోండి. అందుకే తిరుమల సన్నిధికి కాలినడకన వెళ్లినట్లు.. బన్నీని కలుసుకునేందుకు కాలి నడకన హైదరాబాద్ చేరుకున్నాడు. ఏకంగా 200 కి.మీ. నడిచి వచ్చి మొక్కు తీర్చుకున్నాడు. అంత దూరం నుంచి వచ్చిన అభిమానిని చూసి అల్లు అర్జున్ మనసు ఆనందంతో ఉప్పొంగగా.. తనను కలిసి, తనతో గడిపి ముచ్చటించాడు. ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానికి ధన్యవాదాలు తెలిపాడు.
కాగ్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తుండగా.. దీని తర్వాత మెగా మెసేజ్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమాకు రెడీ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రాగా.. అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.