స్టేజిపైనే ఏడ్చేసిన అల్లు అర్జున్.. సుకుమార్ గురించి..

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజిపైనే ఏడ్చేశాడు. ‘పుష్ప’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన.. కొంత మందికి రుణపడి ఉన్నాను అనే మాట వాడతానని తెలిపాడు. తల్లిదండ్రులు, తాతతో పాటు చిరంజీవి గారికి ఎప్పటికీ రుణపడిపోతానన్న బన్నీ.. ‘ఆర్య’ సినిమా చేసిన ఐదారేళ్ల తర్వాత కాస్ట్‌లీ స్పోర్ట్స్ కారు కొన్నానని తెలిపాడు. ఆ సమయంలో తన కెరియర్‌ గ్రాఫ్‌కు రీజన్ ఏంటని బాగా ఆలోచించానని పేర్కొన్నాడు. అది డైరెక్టర్ సుకుమార్ వల్లే అని చివరకు […]

Update: 2021-12-28 06:02 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజిపైనే ఏడ్చేశాడు. ‘పుష్ప’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన.. కొంత మందికి రుణపడి ఉన్నాను అనే మాట వాడతానని తెలిపాడు. తల్లిదండ్రులు, తాతతో పాటు చిరంజీవి గారికి ఎప్పటికీ రుణపడిపోతానన్న బన్నీ.. ‘ఆర్య’ సినిమా చేసిన ఐదారేళ్ల తర్వాత కాస్ట్‌లీ స్పోర్ట్స్ కారు కొన్నానని తెలిపాడు. ఆ సమయంలో తన కెరియర్‌ గ్రాఫ్‌కు రీజన్ ఏంటని బాగా ఆలోచించానని పేర్కొన్నాడు. అది డైరెక్టర్ సుకుమార్ వల్లే అని చివరకు రియలైజ్ అయ్యానని చెప్పాడు. ‘డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను’ అని చెప్తూనే బన్నీ భావోద్వేగానికి గురవ్వగా.. సుకుమార్ కూడా కంటతడి పెట్టాడు. మొత్తానికి తమ అనుబంధం ఎంత బలమైందో చెప్పిన బన్నీ.. కలకాలం ఇదే కంటిన్యూ కావాలని కోరుకున్నాడు.

ఆరు వేల అడుగుల ఎత్తున తాడుపై నడక.. వరల్డ్ రికార్డ్ బ్రేక్!

https://twitter.com/MythriOfficial/status/1475772912846073856?s=20

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma