నూతన వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశంలో 18ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాతి రోజు అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం మంగళవారం విడుదల చేసింది. టీకా కంపెనీల నుంచి రాష్ట్రాల కోటానూ కలుపుకుని 75శాతం స్టాక్‌ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందిస్తుంది. రాష్ట్రాలకు ఈ టీకాల కేటాయింపు ఆయా రాష్ట్రాల జనాభా ప్రతిపదికన జరుగుతుందని స్పష్టం చేసింది. దీనికితోడు, […]
న్యూఢిల్లీ: దేశంలో 18ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాతి రోజు అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం మంగళవారం విడుదల చేసింది. టీకా కంపెనీల నుంచి రాష్ట్రాల కోటానూ కలుపుకుని 75శాతం స్టాక్‌ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందిస్తుంది. రాష్ట్రాలకు ఈ టీకాల కేటాయింపు ఆయా రాష్ట్రాల జనాభా ప్రతిపదికన జరుగుతుందని స్పష్టం చేసింది. దీనికితోడు, వైరస్ ఉధృతి, వ్యాక్సినేషన్ పురోగతిలపై ఆధారపడి ఉంటుందని వివరించింది. ఒకవేళ టీకాల వృథా అధికంగా ఉంటే ఆ రాష్ట్రాల టీకా కేటాయింపులకు కోత పెడతామని తెలిపింది. దేశీయ టీకా ఉత్పత్తిదారులు నేరుగా ప్రైవేటు హాస్పిటళ్లకు వ్యాక్సిన్లు అమ్ముకోవడానికి అవకాశమిచ్చింది. కొనుగోలు ధరపై సర్వీసు చార్జీ 150కి మించి కలుపొద్దని తెలిపింది. టీకా సరఫరా వివారలు రాష్ట్రాలకు ముందస్తుగా తెలియజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలూ అదే తీరులో జిల్లా స్థాయిలో, టీకా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టీకాల వివరాలను వెల్లడించాలని పేర్కొంది.
సెకండ్ డోసుకు ఫస్ట్ ప్రయారిటీ
హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లుపైబడినవారికి వేయాల్సిన రెండో డోసుకు తొలి ప్రాధాన్యమివ్వాలని గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి. తర్వాతే 18 ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీకి చాన్స్ ఇవ్వాలని తెలిపాయి. ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా పౌరులందరూ ఉచితంగా టీకా వేసుకోవడానికి అర్హులేనని, కానీ, చెల్లింపు జరిపే సామర్థ్యమున్నవారు ప్రైవేటు హాస్పిటల్ టీకా కేంద్రాల్లో వేసుకోవాలని కేంద్రం సూచించింది.