‘దోస్త్’కు సెకండ్ ఫేస్ సీట్ల కేటాయింపు
దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ మొదటి ఫేజ్‌లో సీటు పొందని విద్యార్థులకు సెకండ్, థర్డ్ ఫేజుల్లో అవకాశం కల్పిస్తున్నామని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోని సీటు పొందవచ్చని సూచించారు. ఆగస్ట్ 05 నుంచి 18 వరకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. ఫస్ట్ పేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు దోస్త్ తరుపున మెసేజ్ పంపిస్తామని తెలిపారు. ఆగస్ట్ 9 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ మొదటి ఫేజ్‌లో సీటు పొందని విద్యార్థులకు సెకండ్, థర్డ్ ఫేజుల్లో అవకాశం కల్పిస్తున్నామని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోని సీటు పొందవచ్చని సూచించారు. ఆగస్ట్ 05 నుంచి 18 వరకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. ఫస్ట్ పేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు దోస్త్ తరుపున మెసేజ్ పంపిస్తామని తెలిపారు.
ఆగస్ట్ 9 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారణ చేసుకోవాలని పేర్కొన్నారు. గడువు తేదిలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయకపోతే సీటును కోల్పోవాల్సి వస్తుందన్నారు. సీటును పొందాలనుకుంటే తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో సంతృప్తి చెందని విద్యార్థులు సీటు రిజర్వ్ చేసుకొని సెకండ్ ఫేజ్‌కు వెళ్లవచ్చని వివరించారు.