సీఎం కేసీఆర్‌కు అఖిలపక్షం లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: బొగ్గు బ్లాకుల వేలాన్ని ఖండిస్తూ ఆందోళనలు చేపట్టిన బీజేపీ, ప్రైవేటీకరణకు పూనుకోవడం తిరోగమన విధానానికి అద్దం పుడుతుందని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేశారు. సహజవనరులను గుత్తపెట్టుబడిదారులకు కట్టబెట్టడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్షం నాయకులు సీఎల్పీనేత భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజెఎస్ కోదండరామ్, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణలు సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం […]
దిశ, న్యూస్‌బ్యూరో: బొగ్గు బ్లాకుల వేలాన్ని ఖండిస్తూ ఆందోళనలు చేపట్టిన బీజేపీ, ప్రైవేటీకరణకు పూనుకోవడం తిరోగమన విధానానికి అద్దం పుడుతుందని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేశారు. సహజవనరులను గుత్తపెట్టుబడిదారులకు కట్టబెట్టడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్షం నాయకులు సీఎల్పీనేత భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజెఎస్ కోదండరామ్, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణలు సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసారు. యూపీఎ ప్రభుత్వంలో 218బొగ్గు బ్లాకులను వేలం వేయడంతో అందులో కుంభకోణం జరిగిందని పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున్న ఆందోళన జరిగిందని గుర్తుచేశారు. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి 218 బొగ్గు బ్లాకులకు గాను 214 బ్లాకుల టెండర్లు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ నాటి సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని కోరారు. 2014కు ముందు బొగ్గు బ్లాకులను వేలాన్ని ఖండిస్తూ వచ్చిన బీజేపీ విపత్కర పరిస్థితిలో ప్రైవేటీకరణకు పూనుకొని వేలం వేయడానికి నిర్ణయించడం తిరోగమన విధానానికి అద్దం పడుతుందని విమర్శించారు.
సింగరేణిలో ఇప్పటికే 28 అండర్ గ్రౌండ్ వైన్స్, 19 ఓపెన్ కాస్టులలో బొగ్గు వెలకితీయబడుతుందని తెలిపారు. గత ఏడాదిలో రూ.1700 కోట్ల లాభం సమకూరిందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. లేకపోతే బొగ్గు నిల్వలు లేక సింగరేణి మూతపడే ప్రమాదముందని తెలిపారు. దూరదృష్టితో ఎట్టి పరిస్థితిలో సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీపరం కాకుండ రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని సీఎం కేసీఆర్‌ను లేఖలో కోరారు.