బీసీ గణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.. కిషన్ రెడ్డికి వినతి

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గణనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ కోరారు. ఈమేరకు హైదరాబాద్​లో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో బీసీ కులాల జనగణన చేపట్టాలని, దీనిపై జాతీయస్థాయిలో ప్రధాని మోడీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చూడాలని కోరారు. అనంతరం శ్రీనివాస్​గౌడ్ ​మాట్లాడుతూ.. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా […]

Update: 2021-12-10 11:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గణనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ కోరారు. ఈమేరకు హైదరాబాద్​లో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో బీసీ కులాల జనగణన చేపట్టాలని, దీనిపై జాతీయస్థాయిలో ప్రధాని మోడీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చూడాలని కోరారు. అనంతరం శ్రీనివాస్​గౌడ్ ​మాట్లాడుతూ.. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు తీసినా.. నేటి వరకు ప్రకటించలేదన్నారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లుగా శ్రీనివాస్​గౌడ్ ​వెల్లడించారు.

Tags:    

Similar News