అసలు ఈ ఎల్‌జీ పాలిమర్స్ ఎక్కడిది?

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలో విషవాయువు ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో జనరల్ పర్పస్ పాలీస్టైరిన్, హై పాలీస్టైరిన్ ఉత్పత్తులు, ఎక్స్‌పాండబుల్ పాలీస్టైరిన్ ఉత్పత్తులు తయారవుతాయి. ఇది హిందూస్థాన్ పాలిమర్స్ పేరుతో 1961లో స్థాపితమైంది. తర్వాత 1978లో యూబీ గ్రూప్ వారి మెక్ డొవెల్ అండ్ కో కంపెనీ దీన్ని సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాలో స్టైరెనిక్స్ వ్యాపారంలో ప్రసిద్ధి పొందిన ఎల్‌జీ కెమికల్స్ సంస్థ భారత మార్కెట్‌లో ప్రవేశించడానికి హిందూస్థాన్ పాలిమర్స్ సంస్థ అయితే బాగుంటుందని నిర్ణయించుకుంది. […]

Update: 2020-05-06 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలో విషవాయువు ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో జనరల్ పర్పస్ పాలీస్టైరిన్, హై పాలీస్టైరిన్ ఉత్పత్తులు, ఎక్స్‌పాండబుల్ పాలీస్టైరిన్ ఉత్పత్తులు తయారవుతాయి. ఇది హిందూస్థాన్ పాలిమర్స్ పేరుతో 1961లో స్థాపితమైంది. తర్వాత 1978లో యూబీ గ్రూప్ వారి మెక్ డొవెల్ అండ్ కో కంపెనీ దీన్ని సొంతం చేసుకుంది.

దక్షిణ కొరియాలో స్టైరెనిక్స్ వ్యాపారంలో ప్రసిద్ధి పొందిన ఎల్‌జీ కెమికల్స్ సంస్థ భారత మార్కెట్‌లో ప్రవేశించడానికి హిందూస్థాన్ పాలిమర్స్ సంస్థ అయితే బాగుంటుందని నిర్ణయించుకుంది. అదే ఉద్దేశంతో 1997, జులైలో హిందూస్థాన్ పాలిమర్స్‌లో వంద శాతం వాటాను కొనుక్కొని ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా పేరు మార్చింది. తర్వాత ఈ సంస్థ కూడా భారత్‌లో మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సంస్థ ఎన్విరాన్‌మెంటల్, హెల్త్ అండ్ సేఫ్టీ వారి అన్ని ప్రాథమిక ప్రమాణాలను సంతృప్తి పరిచింది.

Tags: styrene, vizag, LG polymers, south korea, Hindustan polymers, Indian market

Tags:    

Similar News