ఆలియా నవ్వుకు అంత పవర్ ఉందా..?
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. కామతిపుర రాణిగా ఆడియన్స్‌ను మెప్పించనున్న ఆలియా నెక్స్ట్ మూవీస్ కూడా దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తో పాటు విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో అందం, అభినయంతో మెప్పిస్తున్న ఆలియాను ప్రశంసిస్తూ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ […]
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. కామతిపుర రాణిగా ఆడియన్స్‌ను మెప్పించనున్న ఆలియా నెక్స్ట్ మూవీస్ కూడా దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తో పాటు విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
ఈ క్రమంలో అందం, అభినయంతో మెప్పిస్తున్న ఆలియాను ప్రశంసిస్తూ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ఆమె క్యూట్ ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. తను వైట్ వేర్‌లో కూర్చుని బుక్ చదువుతూ నవ్వుతున్న స్టిల్స్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ఫొటోను ఉద్దేశించి ‘ఆలియా తన నవ్వును అందరికీ వ్యాపింపజేయగలదని’ ఫిల్మ్ ఫేర్ పేర్కొనగా.. కరోనా సెకండ్ వేవ్ కంటే వేగంగా వ్యాప్తి కాదేమోనని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#AliaBhatt’s smile is infectious, isn’t it? pic.twitter.com/mBx0mkyVhC
— Filmfare (@filmfare) April 18, 2021