కదిలే రైలు.. పోయే ప్రాణం.. క్షణాల్లో క్షేమం!

దిశ, ఫీచర్స్ : ‘కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం కానీ, ఎక్కడం కానీ చేయొద్దు.. అలా చేస్తే మీరు మీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకున్నట్లే’ అని రైల్వే స్టేషన్లలో ప్రకటనలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రయాణికులు ప్రమాదాల బారినపడకుండా ఉండేందుకు గాను రైల్వే శాఖ ఈ అనౌన్స్‌మెంట్ చేయిస్తుంటుంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ప్రమాదంలో చిక్కుకోబోయిన ఓ వ్యక్తిని కాపాడి, రైల్వే కానిస్టేబుల్ వార్తల్లో నిలిచాడు. ఇందుకు […]

Update: 2021-03-11 04:45 GMT

దిశ, ఫీచర్స్ : ‘కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం కానీ, ఎక్కడం కానీ చేయొద్దు.. అలా చేస్తే మీరు మీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకున్నట్లే’ అని రైల్వే స్టేషన్లలో ప్రకటనలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రయాణికులు ప్రమాదాల బారినపడకుండా ఉండేందుకు గాను రైల్వే శాఖ ఈ అనౌన్స్‌మెంట్ చేయిస్తుంటుంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ప్రమాదంలో చిక్కుకోబోయిన ఓ వ్యక్తిని కాపాడి, రైల్వే కానిస్టేబుల్ వార్తల్లో నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

గోవాలోని వాస్కో రైల్వే‌స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ‘వాస్కో-పాట్నా ఎక్స్‌ప్రెస్(02741)’ మూవ్ అవుతున్న క్రమంలో ఓ వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అదుపుతప్పి ప్లాట్‌ఫామ్ మధ్యలో చిక్కుకుపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి, వెంటనే అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్.. ప్లాట్‌ఫామ్‌, ట్రైన్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకు లాగడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్‌ను ప్రయాణికులు, తోటి సిబ్బందితో పాటు అధికారులు మెచ్చుకున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘రియల్ హీరో’ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News