నా ఫోకస్ ఆడియన్స్ : అక్షయ్
దిశ, వెబ్ డెస్క్ : కిలాడి అక్షయ్ కుమార్ ‘‘లక్ష్మీ’’ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. చాలా పూర్ రేటింగ్స్‌తో విమర్శకులకు పని చెప్పింది. ఓవర్ సీస్లో కలెక్షన్స్ బాగున్నా..ఇండియాలో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీకి మాత్రం అంతగా ఆదరణ లభించలేదు. కానీ, ఓపెనింగ్స్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ను బీట్ చేసింది. దీనిపై అక్షయ్ కుమార్ స్పందించారు. తన సినిమాలకు చాలా మంది విమర్శకులు ఉన్నారని, ఆ విషయాన్ని […]
దిశ, వెబ్ డెస్క్ : కిలాడి అక్షయ్ కుమార్ ‘‘లక్ష్మీ’’ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. చాలా పూర్ రేటింగ్స్‌తో విమర్శకులకు పని చెప్పింది. ఓవర్ సీస్లో కలెక్షన్స్ బాగున్నా..ఇండియాలో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీకి మాత్రం అంతగా ఆదరణ లభించలేదు. కానీ, ఓపెనింగ్స్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ను బీట్ చేసింది. దీనిపై అక్షయ్ కుమార్ స్పందించారు.
తన సినిమాలకు చాలా మంది విమర్శకులు ఉన్నారని, ఆ విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని అక్షయ్ చెప్పాడు. తన ఫోకస్ ఆడియన్స్ మీద మాత్రమే ఉంటుందన్నారు. ఈ చిత్రం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది అని తెలిపారు. ఒక ట్రాన్స్ జెండర్ కథానాయకుడిగా ఉన్న ఈ సినిమా.. LGBTQ కమ్యూనిటీ హక్కులను సాధారణీకరిస్తుందని, మరింత పటిష్టం చేస్తుందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తను ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ‘కాంచన’ రీమేక్. కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్ చేశారు. నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఫుల్ లెంథ్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీలో అక్షయ్..ట్రాన్స్ జెండర్‌గా కనిపించారు.