అక్షయ్ పెద్ద మనసు.. రూ. 25 కోట్ల విరాళం

దిశ, వెబ్‌డెస్క్: దేశం కోవిడ్ 19 వ్యాధి ద్వారా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుండగా… భవిష్యత్ తరాల గురించి మనమంతా కలిసి కరోనా వైరస్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విపత్తు నిర్వహణ సామర్ధ్యం బలోపేతం చేసేందుకు, పౌరులను రక్షించే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రతీ పౌరుడు ముందుకు రావాలని కోరారు. భారత భవిష్యత్ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మీరు చేసే చిన్న విరాళమైనా పీఎం- కేర్స్ ఫండ్‌ ఆహ్వానిస్తుందని తెలిపారు. This is that time when […]

Update: 2020-03-28 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశం కోవిడ్ 19 వ్యాధి ద్వారా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుండగా… భవిష్యత్ తరాల గురించి మనమంతా కలిసి కరోనా వైరస్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విపత్తు నిర్వహణ సామర్ధ్యం బలోపేతం చేసేందుకు, పౌరులను రక్షించే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రతీ పౌరుడు ముందుకు రావాలని కోరారు. భారత భవిష్యత్ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మీరు చేసే చిన్న విరాళమైనా పీఎం- కేర్స్ ఫండ్‌ ఆహ్వానిస్తుందని తెలిపారు.

మోడీ పిలుపు మేరకు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ముందుకొచ్చారు. దేశ ప్రజల జీవితాల గురించి ఆలోచించాల్సిన సమయమిదని… మనం తప్పకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. నా వంతు సాయంగా రూ. 25 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. పీఎం కేర్స్ ఫండ్‌కు సూక్ష విరాళాలు అందించైనా సరే ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మీరు సైతం సహాయం అందించాలని అభిమానులకు సూచించారు.

Tags:    

Similar News