కిలాడీ ‘బెల్ బాటమ్’ లుక్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ప్రస్తుతం స్కాట్‌లాండ్‌లో ‘బెల్ బాటమ్’ షూటింగ్‌లో పాల్గొన్న అక్షయ్ బర్త్ డేను మామూలుగా ప్లాన్ చేయలేదు మూవీ యూనిట్. రంజిత్ ఎం తివారీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో వాణి కపూర్, లారా దత్తా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో కనిపించబోతుండగా.. అక్షయ్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. https://twitter.com/Vaaniofficial/status/1303537856871243778?s=19 […]

Update: 2020-09-09 01:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ప్రస్తుతం స్కాట్‌లాండ్‌లో ‘బెల్ బాటమ్’ షూటింగ్‌లో పాల్గొన్న అక్షయ్ బర్త్ డేను మామూలుగా ప్లాన్ చేయలేదు మూవీ యూనిట్. రంజిత్ ఎం తివారీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో వాణి కపూర్, లారా దత్తా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో కనిపించబోతుండగా.. అక్షయ్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

https://twitter.com/Vaaniofficial/status/1303537856871243778?s=19

80వ దశకంలో బాగా పాపులర్ అయిన ఫ్యాషన్ లుక్‌లో ఏరోప్లేన్ ముందు నిల్చున్న అక్షయ్.. సన్ గ్లాసెస్‌తో సూపర్ కూల్‌గా కనిపిస్తున్నారు. ఈ లుక్‌కు ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిదా కాగా.. థియేటర్‌లో సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక వాణి, అక్షయ్‌లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందోనని సూపర్ ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు ఫ్యాన్స్.

కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటుండగా.. టెనెట్ సినిమా రిలీజ్ అయింది. ఇందుకోసం పలువురు స్టార్స్ తమ మద్దతు తెలుపుతున్న క్రమంలో ఇండియాలో టెనెట్ రిలీజ్‌కు, థియేటర్ల ఓపెనింగ్‌కు మద్దతు తెలిపేందుకు అక్షయ్ కుమార్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News